- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చదువుల తల్లికి పలువురు ఆర్థిక సాయం
దిశ, ఖమ్మం బ్యూరో : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక సహాయంపై ఈనెల 5వ తేదీన దిశ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విధితమే. ఈ కథనంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కేపీఎస్జీ సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్ విరాళాలను సేకరించారు. ఈ గ్రూప్ లో వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్ట్, ఎన్ఆర్ఐలు, విద్యాసంస్థలు, విద్యార్థులు, ఇతర రంగాల ప్రముఖులు ఆర్థిక సహాయం అందించారు.
అయితే ఆదివారం చదువుల తల్లి శిగ గౌతమిని ఖమ్మంకు పిలిపించి షాదీఖానాలో ఘనంగా సత్కరించి ఉమ్మడి ఖమ్మం జిల్లా కేపీఎస్జీ గ్రూప్ ద్వారా సేకరించిన రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ విరాళాల కార్యక్రమానికి కోశాధికారులుగా వ్యవహరించిన రెండు గ్రూప్ ల నుండి అప్పారీ లక్ష్మణ్,మొహమ్మద్ ముజీబ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షౌకత్ ఆలీ, ప్రముఖ వైద్యుడు ఆరిఫ్, మాజీ షాదీఖానా డైరెక్టర్ సయ్యద్ ఉమర్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
దిశకు ప్రత్యేక కృతజ్ఞతలు
మెడికో శిగ గౌతమిపై ప్రచురితమైన కథనంపై ఖమ్మం పొలిటికల్ అండ్ సొసైటీ గ్రూప్ సభ్యులంతా దిశ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయి పేదరికంలో కొట్టుమిట్టాడుతూ తాత నానమ్మల వద్ద ఉంటూ పత్తితో పాటు వివిధ రకాల పంట చేలల్లో దినసరి కూలికి వెళ్లి చదువుకొని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన విషయం ప్రచురించినందుకు వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కథనం చదివిన అనేక మంది దాతలు ఇప్పటికే ముందుకొస్తున్నారు. కాగా దాతలకు సొసైటీ గ్రూప్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.