- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
దిశ, కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. ఈ సంఘటన పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ బస్టాండ్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గ్రామానికి చెందిన జిలుగవల్లి నిరంజనమ్మ(56) తన పుట్టింటికి ముష్టిపల్లి గ్రామానికి శనివారం వెళ్ళింది. తిరిగి ఆదివారం స్వగ్రామం కుడికిళ్ళ కు ప్రయాణమై ముష్టిపల్లి స్టేజీ వద్ద బస్సెక్కి కల్వకోల్ వద్ద బస్ దిగింది. అక్కడి నుంచి ఆమె స్వగ్రామం కుడికిళ్లకు రోడ్డు పక్క నుంచి కాలినడకన వెళ్తుండగా..హైద్రాబాద్ నుంచి కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి నిరంజనమ్మను ఢీ కొట్టింది. దీంతో బాధితురాలు అక్కడిక్కడే మృతి చెందింది. అయితే సదరు కారులో ప్రయాణించిన వారిలో ఇద్దరు యువతులు,మరో ఇద్దరిలో ఒకరు ప్రొఫెసర్, మరొకరు అడ్వకేట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ఆందోళన శిబిరానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రంగస్థలంలో ఉన్న ఏఎస్ఐ బాలనారాయణకు సూచించారు.