- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మంత్రి తుమ్మల...
దిశ,సూర్యాపేట టౌన్; వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సూర్యాపేట జిల్లా టేకుమట్లలో ఐ.కే.పి నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, అక్కడ రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. వానాకాలం దిగుబడుల గురించి ఆరా తీయగా..దానికి రైతులు సరాసరి ఎకరానికి 40 బస్తాల కంటే ఎక్కువగానే దిగుబడి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో కూడా తమకు మంచి ఆకర్షణీయమైన ధర వస్తుందని, మిల్లర్లు కూడా తేమశాతం పట్టించుకోకుండా కల్లాల మీదనే కొనుగోలు చేస్తున్నారన్నారు. దానికి మంత్రి స్పందిస్తూ..ప్రభుత్వం సేకరించే ధాన్యం గోదాముల్లో నిల్వ ఉంచి, అవసరాలకు తగ్గట్లుగా బియ్యం పట్టిస్తారని, అప్పటిదాకా రంగు మారకుండా ఉండటానికి 17శాతం తేమ నిబంధన పాటించాల్సి ఉందని తెలిపారు. మన ప్రజలకే నాణ్యమైన బియ్యాన్ని చౌకధరల దుకాణాల ద్వారా అందించడానికి ఆ నిబంధన పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.