Tata-Pegatron: టాటా ఎలక్ట్రానిక్స్ కీలక నిర్ణయం.. ఐఫోన్ తయారీ ప్లాంటులో మెజారిటీ వాటా కొనుగోలు..!

by Maddikunta Saikiran |
Tata-Pegatron: టాటా ఎలక్ట్రానిక్స్ కీలక నిర్ణయం.. ఐఫోన్ తయారీ ప్లాంటులో మెజారిటీ వాటా కొనుగోలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో గత కొంత కాలంగా ఐఫోన్ల(iphones) విక్రయాలు జోరు అందుకున్న విషయం తెలిసిందే. ఐఫోన్ల ఎగుమతుల్లో ఇటీవలే మన దేశం రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి ఏకంగా రూ.50,000 కోట్ల విలువైన ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అలాగే చైనా(China)-అమెరికా(US) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో ఐఫోన్ల తయారీ ప్లాంటులను ఏర్పాటు చేయడానికి యాపిల్(Apple) సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే.. తమిళనాడు(TN)లోని ఐఫోన్ తయారీ ప్లాంట్ పెగట్రాన్(Pegatron)తో టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఐఫోన్ ప్లాంటులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. 10,000 మంది సిబ్బంది ఉన్న ఈ ప్లాంటులో ఒప్పందం ప్రకారం టాటాకు 60 శాతం, పెగట్రాన్ 40 శాతం వాటా దక్కనుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం 5 మిలియన్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. కాగా గత సంవత్సరం కర్ణాటక, హోసూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంటులలో కూడా టాటా మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story