TG: నిరుద్యోగులకు మంత్రి దామోదర రాజనరసింహా కీలక సూచన

by Gantepaka Srikanth |
TG: నిరుద్యోగులకు మంత్రి దామోదర రాజనరసింహా కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖ(Health Department)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహా(Minister Damodara Rajanarasimha) నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. మరో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టులు, 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌(ఎంఎన్‌జే) పోస్టులు, 24 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

భవిష్యత్తులో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. విద్యార్హతలు, రాతపరీక్షలు ఇతర నిబంధన ప్రకారం పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు‌. ఇందులో ఎలాంటి రాజీ లేదని, ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి, వారిఫై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు‌కు మోసగాళ్ల సమాచారాన్ని అందజేయాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Advertisement

Next Story