CM Revanth Reddy: ఆ విషయంలో ప్రధాని మోడీనే నెంబర్ వన్

by Gantepaka Srikanth |
CM Revanth Reddy: ఆ విషయంలో ప్రధాని మోడీనే నెంబర్ వన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఛ‌త్రపతి శివాజీ(Chhatrapati Shivaji), జ్యోతిబా పూలే, బీఆర్ అంబేద్కర్, బాలా సాహెబ్‌, శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar) వంటి యోధులు పుట్టిన నేల‌లో ఇప్పుడు ఏక్ నాథ్ శిండే, అజిత్ ప‌వార్‌, అశోక్ చ‌వాన్ వంటి విద్రోహులు త‌యార‌య్యార‌ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. వీళ్లంతా గుజ‌రాత్ గులాంలుగా మారార‌ని సీఎం సీరియస్ అయ్యారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్రచార భాగంగా సీఎం రేవంత్ న‌యాగామ్‌, భోక‌ర్‌, నాందేడ్‌లో ప్రచారం నిర్వహించారు. అనంతరం సోలాపూర్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. అబ‌ద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబ‌ర్ వ‌న్‌గా ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ నిలుస్తార‌ని విమ‌ర్శించారు. ఆటో డ్రైవ‌ర్‌గా ఉన్న ఏక్‌నాథ్ శిండేను మంత్రి వ‌ర‌కూ బాలాసాహెబ్ కుటుంబం తీసుకొచ్చింద‌ని.. సొంత కుమార్తెను కాద‌ని అజిత్ ప‌వార్‌ను శ‌ర‌ద్ ప‌వార్ ఉప ముఖ్యమంత్రిని చేశార‌ని గుర్తుచేశారు. అశోక్ చ‌వాన్‌ తండ్రి శంక‌ర్ రావు చౌహాన్‌ను కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ముఖ్యమంత్రులను చేసింద‌ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు ఆ ముగ్గురూ విద్రోహులుగా మారి వీరుల నేల‌ను అవ‌మానాల‌ పాలు చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తెలంగాణ‌లో త‌మ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ.18 వేల కోట్లతో రైతుల రుణ‌మాఫీ చేసిందన్నారు. మ‌హారాష్ట్రలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతుల‌కు రూ.3 ల‌క్షల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ‌లో రుణ‌మాఫీతో పాటు మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలిండ‌ర్.. 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న న‌యాగామ్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్ధి డాక్టర్ మీన‌ల్ పాటిల్ ఖ‌త్‌గావ్‌క‌ర్‌, భోక‌ర్ అభ్యర్ధి తిరుప‌తి క‌ద‌మ్ కొందేక‌ర్‌, దక్షిణ సోలాపూర్ అభ్యర్ధి చేత‌న్ న‌రొటే, నాందేడ్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ అభ్య‌ర్థి ర‌వీంద్ర చౌహాన్‌ల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed