- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
దిశ,తాడ్వాయి: మండలంలోని కృష్ణజివాడి గ్రామంలో శుక్రవారం బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. వివాహానికి సిద్ధపడిన మైనర్ బాలికకు ఇరువురి తల్లిదండ్రులకు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి కౌన్సెలింగ్ చేశారు. ఐసీడీఎస్ అధికారులు కథనం ప్రకారం వివరాలు ఉన్నాయి. బీబీపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన ఓ యూవకుడితో కృష్ణజివాడి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి చేస్తున్నారని 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం రావడం జరిగిందని వారు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి కృష్ణాజివాడి గ్రామంలో వివాహం జరిగే ప్రదేశానికి వెళ్లి ఇరువురి కుటుంబ సభ్యులతో చర్చించి, ఇరువురు తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలను తల్లిదండ్రులకు వివరించామన్నారు. బాలికకు వివాహ వయస్సు రాకుండా పెళ్లి చేయరాదన్నారు. అనంతరం మైనర్ బాలికను బాల్ సదన్ కు తీసుకెళ్లి ఉంచడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. బాల్యవివాహాలు చెయ్యడానికి ఎవరు పునుకున్న టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సంబంధిత పోలీసులకు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వీణ,చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ స్వరూప,సిబ్బంది బాలకృష్ణ, పోలీసులు,రెవెన్యూ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.