AP News:నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి రోల్ మోడల్:ఎంపీ కేశినేని శివనాథ్

by Jakkula Mamatha |
AP News:నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి రోల్ మోడల్:ఎంపీ కేశినేని శివనాథ్
X

దిశ,వెబ్‌డెస్క్: అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్(Border Gavaskar Series) నాలుగో టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించిన తెలుగు తేజం నితీశ్‌ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కెరీర్‌లో తొలి సెంచరీ (First century)సాధించడం సర్వత్రా ప్రశంసలందుకుంటుంది. ఈ క్రమంలో ఇండియన్ క్రికెట్ టీమ్‌కు సెలెక్ట్ అయిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఏసీఏ త‌రుఫున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల నగదు ప్ర‌క‌టించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రోత్సాహక నగదు బహుమతిని నితీష్ కుమార్ రెడ్డికి అందిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్(MP Keshineni Shivnath) తెలిపారు.

గురునాన‌క్ కాల‌నీ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ వద్ద నిర్వహించిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి ఇండియా క్రికెట్ టీమ్ త‌రుఫున ఇంటర్నేష‌న‌ల్ మ్యాచ్లు ఆడేందుకు ఎంపిక కావడం శుభ‌ప‌రిణామం అన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్ రౌండ‌ర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి లాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి రోల్ మోడల్ అని పేర్కొన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను అమరావతిలో నిర్మిస్తాం అన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్ లు అదేవిధంగా విశాఖపట్నం స్టేడియం సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రానికి కూడా‌ ఐపీఎల్ టీమ్ సిద్ధం చేసేలా ఏసీఏ ఆలోచన చేస్తోంది. ఈ స‌మావేశంలో ప్రకాశం డిస్ట్రిక్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ కారుశీల నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌కాశం డిస్ట్రిక్ అసోసియేష‌న్ మెంబ‌ర్ కె.బ‌ల‌రామ్, రావినూత‌ల స్పోర్ట్స్ అండ్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ మోప‌ర్తి శేష‌రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed