ఆ సినిమా కోసం తెగ కష్టపడి పోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. షాకింగ్ లుక్ వైరల్

by Kavitha |   ( Updated:2024-12-28 11:21:45.0  )
ఆ సినిమా కోసం తెగ కష్టపడి పోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. షాకింగ్ లుక్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘మజాకా’ అనే మూవీ చేస్తున్నాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సందీప్ కిషన్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. షర్ట్ లేకుండా తన సిక్స్ ప్యాక్ బాడీను చూపిస్తూ సాలీడ్‌గా కనిపించాడు. అయితే సందీప్ ‘మజాకా’ సినిమా కోసమే ఇంతగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇతని హార్డ్ వర్క్‌కి మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మూవీ అంటే ఎంత ఫ్యాషన్ అయి ఉంటే ఇంత కష్టపడతాడు కదా. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు సూపర్ సిక్స్ ప్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed