- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారికి వ్యవసాయ మోటార్లు కనిపిస్తే ఖతమే
దిశ, కూసుమంచి : మండలంలోని రైతుల పొలాల వద్ద మోటార్లను దొంగిలించిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు కూసుమంచి ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలకొండపల్లిలో మోటార్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 కేజీల కాపరు వైరు, రూ. 70 వేల డబ్బులు, మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. కూసుమంచి శివారులో గల క్రషర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ మీద వస్తున్న లచ్చు, శంకర్ లను ఆపి పరిశీలించగా వారి వద్ద 20 కేజీల కాపరు వైరు దొరికిందని తెలిపారు.
ఆ వైరు పాలేరు శివారులో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారని చెప్పారు. కూసుమంచి మండలంలోని నాయకన్గూడెంకి చెందిన నాగేశ్వరావుకి వైరు అమ్ముతున్నట్టు తెలిపారు. నాగేశ్వరావు కాపర్ వైరును హైదరాబాద్ లోని యాది అలియాస్ మహేష్ కు విక్రయించగా వచ్చిన సొమ్ము రూ. 70 వేలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరు మొత్తం 28 విద్యుత్ మోటార్లు దొంగిలించి అందులోని కాపర్ వైరును వేరుచేసి ఒక్కొక్క మోటార్ కాపర్ వైరు రూ.3 వేలకు అమ్మినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పేర్కొన్నారు. నిందితులని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై నాగరాజు, శ్రీశైలం, గోపి,హోమ్ గార్డ్ రాంబాబు, రమేష్ లను కూసుమంచి సీఐ సంజీవ్ అభినందించారు.