CIPET Recruitment: సీపెట్ లో టీచింగ్ ఉద్యోగ అవకాశాలు.. డీటెయిల్స్ ఇవే..?

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-17 18:37:44.0  )
CIPET Recruitment: సీపెట్ లో టీచింగ్ ఉద్యోగ అవకాశాలు.. డీటెయిల్స్ ఇవే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(CIPET) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 07 టీచింగ్(Teaching) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన ఫిల్ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.cipet.gov.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 4 డిసెంబర్ 2024. మ్యాథమెటిక్స్, ప్లాస్టిక్స్ టెక్నాలజీ, పాలీమర్ సైన్స్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టు పేరు, ఖాళీలు:

  • అసోసియేట్ ప్రొఫెసర్ - 01
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01
  • అసిస్టెంట్ ప్లేస్ మెంట్ కన్సల్టెంట్ - 04
  • లెక్చరర్ - 02

విద్యార్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PHD ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 65 ఏళ్లకు మించి ఉండకూడదు.

జీతం:

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 46,400, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ. 35,000, అసిస్టెంట్ ప్లేస్ మెంట్ కన్సల్టెంట్ పోస్టుకు రూ. 30,000, లెక్చరర్ పోస్టుకు రూ. 35,000 వరకు శాలరీ ఉంటుంది.

Advertisement

Next Story