- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సనాతన ధర్మ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
దిశ, జడ్చర్ల : సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని,మారుతున్న కాలంలో సంప్రదాయాలను కాపాడేందుకు ఆశ్రమాలు చేస్తున్న కృషి అభినందనీయమని మహబూబ్ నగర్ ఎంపీ అరుణ పిలుపునిచ్చారు. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపురం సమీపంలోని శ్రీమలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమంలో గత మూడు రోజులుగా సహస్ర రుద్రాభిషేకం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజు అఖండ రుద్ర హోమం పూర్ణాహుతిలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గత మూడ్రోజులుగా ఆశ్రమంలో జరుగుతున్న రుద్ర సహిత శతచండీయాగం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీ అరుణ ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు వెంటకచరణ్ స్వామి ఆశ్రమ విశిష్టను అక్కడ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..మారుతున్న కాలంలో సంప్రదాయాలను కాపాడేందుకు ఈ ఆశ్రమం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వెంకట్ చరణ్ స్వామి సమక్ష్యంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం ఈ యాగం ఫలాలు ప్రజలందరిపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం గంగాపూర్ ఆశ్రమంలోచేస్తున్న కృషి , భగవత్ గీత పారాయణం వంటివి నిజంగా ఆదర్శప్రాయం అన్నారు. ప్రధాని మోది వల్లే భారతదేశ ఖ్యాతి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో ఉండాలినీ ఆకాంక్షించారు.