- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jarkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి విక్రమార్క
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Telangana Deputy CM Bhatti Vikramarka) జార్ఖండ్(Jarkhand) లో ఇండియా కూటమి(INDIA Alliance) తరపున అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ప్రచారంలో పాల్గొన్నారు. పలు రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ప్రజలకు కూటమికి చెందిన పలు హామీలను ప్రకటించారు. జార్ఖండ్ లో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఏడు హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ కులాలు, జాతుల జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర సంపదను పంచుతాం అన్నారు. జార్ఖండ్ లోని అపార ఖనిజ సంపదపై బీజేపీ(BJP) కన్నేసిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే జాతి సంపద మొత్తం... మోడీ(Modi) మిత్రులకు పంచి పెడతారని వివరించారు. జార్ఖండ్ భవిష్యత్తు కోసం ఇండియా కుటమిని గెలిపించి.. రాష్ట్రాన్ని కాపాడాలను ప్రజలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాగా జార్ఖండ్ లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 20న జరగనున్నాయి.