Whatsapp Pramukh: బీజేపీ కొత్త పోస్టు.. వాట్సాప్ ప్రముఖ్

by Mahesh Kanagandla |
Whatsapp Pramukh: బీజేపీ కొత్త పోస్టు.. వాట్సాప్ ప్రముఖ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బలమైన ఐటీ సెల్ బీజేపీ(BJP IT Cell) సొంతం. సోషల్ మీడియా వినియోగంలో ఇతర పార్టీల కంటే చాలా ముందున్నది. సోషల్ మీడియాలో పర్సనల్ కనెక్ట్ ఎక్కువగా ఉండే వాట్సాప్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే బూత్ లెవల్‌(Booth Level)లో కొత్త పోస్టు సృష్టించింది. ప్రతి బూత్‌కు వాట్సాప్ ప్రముఖ్‌(Whatsapp Pramukh)లను ఎంపిక చేస్తున్నది. తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తొలి వాట్సాప్ ప్రముఖ్‌గా ఎంఎస్సీ చదివిన రామ్ కుమార్ చౌరాసియాను అపాయింట్ చేసింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు సమీపిస్తున్న వేళ బూత్ స్థాయిలో అనేక మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 65,015 బూత్‌లకుగాను ప్రతి బూత్‌కు 12 మంది సిబ్బందిని నియమించుకుంది. బూత్ ప్రెసిడెంట్, బూత్ మినిస్టర్, వాట్సాప్ హెడ్, మన్ కీ బాత్ హెడ్, బెనిఫిషరీ హెడ్(ప్రభుత్వ పథకాలు పొందిన వారితో కాంటాక్ట్‌లో ఉంటారు), పన్నా హెడ్, బీఎల్ఏ-2(పార్టీ వర్కర్లు)లుగా స్ట్రక్చర్ ఫాలో అవుతున్నది. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉండాలనే రూల్ ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed