Night Time Driving Tips: రాత్రిపూట కారు నడుపుతున్నారా? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..!

by Anjali |
Night Time Driving Tips: రాత్రిపూట కారు నడుపుతున్నారా? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: డే టైమ్‌లో కారు(car) నడిపితే పెద్దగా ప్రాబ్లముండదు. కానీ రాత్రిళ్లు కారు డ్రైవ్ చేయాలంటే చాలా జాగ్రతగా ఉండాలి. పైగా ఇది చలికాలం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చిన్న కునుకు తీసిన కూడా కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాగా నైట్ డ్రైవింగ్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మీరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గుర్తుంచుకుంటే చాలు. కేవలం ఈ ఆరు టిప్స్ ఫాలో అవ్వండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హెడ్ లైట్ తప్పనిసరిగా ఉపయోగించాలి..

నైట్ చూపు తక్కువగా ఉంటుంది కాబట్టి స్పీడ్ తగ్గించాలి. తప్పకుండా హెడ్ లైట్(Head light) లను ఉపయోగించాలి. హైవే లేదా ఖాళీ రహదారిపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. హెడ్ లైట్ మేలు చేస్తుంది. దారి చక్కగా కనిపించేందుకు ఉపయోగపడుతుంది. ముందు నుంచే వచ్చే వాహనాలు మీ వల్ల ప్రభావితం కాకుండా ఉండటానికి హెడ్‌లైట్‌లను వన్-వే(One-way) లేదా అర్బన్ రోడ్‌లలో తక్కువ బీమ్‌లో ఉంచడం బెటర్.

మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే..

రాత్రి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట కాంక్రీట్లు(concretes), గుంతలు(pits), జంతువులు(Animals) అడ్డువచ్చే అవకాశం ఉంటుంది. కాగా బ్రేక్ లు సరియైన సమయంలో వేయండి. అలాగే మొబైల్(Mobile) వాడొద్దు. ఇతర విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఫోన్ వాడుతూ.. డ్రైవింగ్ చేస్తే కారు డివైడర్(Divider) వైపు వెళ్లే చాన్స్ ఉంది.

ఆకస్మాత్తుగా బ్రేక్ ఇస్తే..

అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ముందున్న వాహనానికి తగినంత డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మీ ముందున్న కారును ఢీకొట్టే చాన్స్ ఉంటుంది.

నైట్ డ్రైవింగ్‌లో నిద్ర పోతున్నారా..?

అలాగే నైట్ డ్రైవింగ్ లో నిద్ర వస్తుంటుంది. కాగా కారు నడుపుతూ చిన్న కునుకు తీసినా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మధ్యలో టీ తాగండి. లేదా ఫేస్ పై చల్లని వాటర్ తో కడుక్కోండి. లేకపోతే వాహనాలు రాని ప్రదేశంలో కాసేపు కారు ఆపి పడుకోవడం బెటర్. ఈ విషయాలు గుర్తుంచుకుంటే రాత్రి ప్రయాణం సజావుగా సాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed