Manipur: బీజేపీకి బిగ్ షాక్.. మణిపూర్ రాజకీయాల్లో సంచలనం

by Gantepaka Srikanth |
Manipur: బీజేపీకి బిగ్ షాక్.. మణిపూర్ రాజకీయాల్లో సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్(Manipur) రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ(BJP)కి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ(National People's Party) ప్రకటించింది. ఈ మేరకు ఎన్‌పీపీ(NPP) అధ్యక్షుడు సంగ్మా జేపీ నడ్డా(JP Nadda)కు ఆదివారం లేఖ రాశారు. మణిపూర్‌లో అల్లర్లను అదుపుచేయలేకపోతున్నందుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో సంగ్మా పేర్కొన్నారు. మణిపూర్‌లో ఎన్‌పీపీ తరపున మొత్తం ఏడుగురు అభ్యర్థులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఇదిలా ఉండగా.. మణిపూర్ మళ్లీ భగ్గుమంటోంది. మరోసారి హింసాత్మక మంటల్లో కాలిపోతోంది. ఇక్కడ ఆందోళనకారులు ఆగ్రహంతో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడి చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed