- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mahesh Kumar Goud: కిషన్ రెడ్డి కాళ్ళకు సాక్సులు వేసుకొని నిద్రపోయారు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) తలపెట్టిన మూసీ పరివాహక ప్రాంతాల పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC chief Mahesh Kumar Goud) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై ఆపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఫొటో షూట్ కోసం మూసీ(Musi) నిద్ర చేశారని విమర్శించారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారని అన్నారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని చెప్పారు. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) గ్రాఫ్ పడిపోయిన ప్రతీ సారి కిషన్ రెడ్డి బయటకి వస్తాడని ఎద్దేవా చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్‌ను ప్రొటెక్ట్ చేస్తారని కిషన్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అయినా ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారని అడిగారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌కి ఒక న్యాయం.. మూసీ రివర్‌కి ఒక న్యాయమా..? అని అడిగారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు విద్య అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ గులాంలా ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుంది అనగానే.. వీళ్లకు భయం పట్టుకుందని సెటైర్ వేశారు.
గుజరాత్‌ను ఎక్కడ తెలంగాణ వెనక వేస్తుందో అన్న భయం బీజేపీనీ వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. DPR వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టలో తెలుస్తుందని అన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది అని తెలిపారు. పదేళ్లు తెలంగాణ అభివృద్ధి కుంటు పడిందని వెల్లడించారు. అభివృద్ధిలో తెలంగాణ మార్పు చూస్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్‌గా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాని కీలక ప్రకటన చేశారు. కిషన్ రెడ్డి కాళ్ళకు సాక్సులు వేసుకొని నిద్రపోయారని విమర్శించారు. అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుందని అన్నారు. బీజేపీ, BRS ఎవరికి ఆపద వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం ఆదుకుంటున్నారని అన్నారు.