Minister Seethakka : కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

by M.Rajitha |
Minister Seethakka : కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 19న వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు సీతక్క(Seethakka), కొండా సురేఖ(Konda Surekha) పరిశీలించారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న ఈ సభావేదికకు ఇందిరా మహిళా శక్తి(Indira Women Power) ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇది మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదన సభ అని పేర్కొన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. సభా వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవన్ లకు శంకుస్థాపన చేస్తారని సీతక్క ప్రకటించారు. హైదరాబాద్(Hyderabad) తర్వాత వరంగల్(Warangal) ను ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం మాటిచ్చారని, అందుకు అనుగుణంగా పనులు చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు.

Advertisement

Next Story