Amruth Bharath Train : రాజస్థాన్ కు అమృత్ భారత్ రైలు ప్రకటించిన కేంద్రం

by M.Rajitha |
Amruth Bharath Train : రాజస్థాన్ కు అమృత్ భారత్ రైలు ప్రకటించిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం వందే భార‌త్(Vnade Bharath) త‌ర్వాత కొత్తగా అమృత్ భార‌త్ రైళ్ల(Amruth Bharath Train)ను ప్రవేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. తొలి ద‌శ‌లో 26 రూట్లలో అమృత్ భార‌త్ రైళ్లను న‌డిపేందుకు ప్రణాళిక రూపొందించిన‌ రైల్వే శాఖ.. అందులో భాగంగా రాజ‌స్థాన్‌(Rajasthan)లో కూడా ఒక అమృత్ భార‌త్ రైలును ప్రారంభించ‌బోతున్నట్టు ప్రకటించింది. అజ్మీర్(Azmair) నుంచి జైపూర్ మీదుగా రాంచీ(Ranchi) వరకు సాగే ఈ రైలు.. డిసెంబర్ చివ‌రి నాటికి అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రైల్వే రూట్‌, షెడ్యూల్‌పై అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. రైలును ప్రారంభించే తేదీ ఇప్పటికీ ఖ‌రారు కాక‌పోయిన‌ప్పటికీ.. ప్రధాని న‌రేంద్రమోడీ(PM Narendra Modi) జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. గ‌తేడాది ప్రారంభంలో న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మిన‌ల్ రైల్వేస్టేష‌న్ నుంచి ద‌ర్భంగా జంక్షన్ వ‌ర‌కు దేశంలోనే తొలి అమృత్ భారత్ రైలును ప్రారంభించారు. ఆ త‌ర్వాత ప‌లు మార్గాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రకటించిన అమృత్ భారత్ రైలు రాజస్థాన్ కు మొదటిది.

రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి రాంచీ మార్గంలో న‌డిచే ఈ రైలులో క‌నీసం 18 నుంచి గ‌రిష్ఠంగా 22 కోచ్‌లు ఉండే అవ‌కాశం ఉన్నది. అన్ని కోచ్‌లు నాన్ ఏసీ స్లీప‌ర్‌, జ‌న‌ర‌ల్ కేట‌గిరీ చెందిన‌వి. రైలు గ‌రిష్ఠ వేగం గంట‌కు 130 కిలోమీట‌ర్ల స్పీడ్‌తో దూసుకెళ్తుంది. రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, టాక్-బ్యాక్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ప్రయాణికులు ఏదైనా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో లోకోపైలెట్‌, రైలు మేనేజ‌ర్‌ను సంప్రదించేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే, ప్రతి కోచ్‌లో వాక్యూమ్ బయో టాయిలెట్లు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు.

Advertisement

Next Story