- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Damodar Raja Narasimha: కొంతమందికి అవి పుట్టుకతో వచ్చిన బుద్ధులు
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో నిర్వహించిన ప్రజాపాలన(Praja Palana) విజయోత్సవాల్లో మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Raja Narasimha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని బీఆర్ఎస్(BRS) అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే రూ.50 వేల కోట్ల అప్పు తీర్చిన ఘనత రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వానిది అని అన్నారు. పదేళ్లు పాలించి.. రాష్ట్రాన్ని నిలువునా దోచుకొని.. పది నెలల కూడా ఆగలేకపోతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని విమర్శించడమే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీలు పనిచేస్తున్నాయని అన్నారు. వికారాబాద్(Vikarabad) జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి బీఆర్ఎస్ కుట్రే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచివి కాదని తెలిపారు. లగచర్ల ఘటన తర్వాత కొంతమంది ఢిల్లీకి పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు మధ్యలో మారరు అని విమర్శించారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ అలాంటి బుద్ధులు రాలేదని అన్నారు.