Telangana Govt : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు విడుదల

by M.Rajitha |   ( Updated:2024-11-17 10:42:18.0  )
Telangana Govt : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 19న వరంగల్(Warangal) లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభా వేదిక మీదుగా రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాల(Indira Mahila Shakti Bhavans)కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా తాజాగా ఈ 22 ఇందిరా మహిళా శక్తి భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. అలాగే ఆయా భవనాలకు పరిపాలనా అనుమతులు మంజూరు అయినట్టు మంత్రి పేర్కొన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున 22 భవనాల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్వయం సహాయక సంఘాల‌ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ భవనాలు నిర్మించనున్నారు. ఆయా జిల్లాల్లో మహిళ స్వయం సహాయక సంఘాలు వీటి నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ఇందిరా మహిళ శక్తి భవన్ లలో పలు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్, కామన్ వర్క్‌షెడ్‌, ఉత్పత్తుల ప్రదర్శన మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వహ‌ణ‌ తదితర కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story