Minister Sridhar Babu: ఎంపీలు, ఎమ్మెల్యేలే వ్యతిరేకించడం కరెక్ట్ కాదు

by Gantepaka Srikanth |
Minister Sridhar Babu: ఎంపీలు, ఎమ్మెల్యేలే వ్యతిరేకించడం కరెక్ట్ కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ(BJP) నేతల మూసీ(Musi) నిద్రపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి(Kishan Reddy)కి ఇప్పటికైనా మూసీ బాధితుల సమస్యలు ఏంటో తెలిసి ఉండాలని అన్నారు. కలుషిత నీరు, గాలి మధ్య దుర్భర జీవితం గడుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఇంత మంచి కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలే అడ్డుపడటం దారుణం అని అన్నారు. గోడలు కడితే సరిపోతుందని బీజేపీ నేతలు అంటున్నారు.

డీపీఆర్ వచ్చాక ఏం చేయాలనే దానిపై సలహాలు ఇవ్వాలని సూచించారు. మూడు నెలలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే.. ఒక్క రోజు గడిపి చేతులు దులుపుతున్నారని విమర్శించారు. మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలి కానీ, నిద్ర పూర్తయిన వెంటనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. మూసీ ప్రజలకు మంచి నీరు, మంచి ఇల్లు, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు.

Advertisement

Next Story