- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shyamala Rao: టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈవో శ్యామల రావు ప్రమాణం.. కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ (TTD) ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈవో శ్యామల రావు (EO Shyamala Rao) ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు తిరుమల (Tirumala) ఆలయ ప్రాంగణంలోని బంగారు వాకిలి వద్ద శ్యామల రావు (Shyamala Rao)తో అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary) ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామల రావు (EO Shyamala Rao)కు టీటీడీ అధికారులు (TTD Officials) స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అదేవిధంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్యామల రావు (Shyamala Rao) మాట్లాడుతూ.. టీటీడీ (TTD) ఈవోగా తనకు అవకాశం కల్పించినందుకు గాను సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఐదు నెలలుగా టీటీడీ (TTD)లో అనేక మార్పులు చేశామని పేర్కొన్నారు. అన్న ప్రసాదం (Anna Prasadam) నుంచి మొదలు ఐటీ విభాగం (IT Department) వరకు సమూల మార్పులు చేశామని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కొత్త పాలకమండలిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని శ్యామల రావు అన్నారు.