Ravichandran Ashwin: కెరీర్ లో 106 టెస్టులు..అయినా పాక్ తో ఒక్క టెస్టు ఆడలేక పోయాడు..!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-22 10:55:38.0  )
Ravichandran Ashwin: కెరీర్ లో 106 టెస్టులు..అయినా పాక్ తో ఒక్క టెస్టు ఆడలేక పోయాడు..!
X

దిశ, వెబ్ డెస్క్ : రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కు తన సుదీర్ఘ కెరీర్ లో ఒక అంశం అంసతృప్తిని మిగిల్చింది. తన టెస్టు కెరీర్ లో టీమిండియా(INDIA) తరుపునా ఏకంగా 106టెస్టులు ఆడి 537వికెట్లు తీసిన అశ్విన్ దాయాది దేశం పాకిస్థాన్(Pakistan) తో టెస్టు మ్యాచ్ ఆడాలన్న కల నెరవేరకుండానే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సివచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలతోనూ టెస్టులు ఆడాడు. కానీ పాకిస్థాన్ తో మాత్రం తన కెరీర్లో ఒక్క టెస్టూ ఆడలేదు. ఇందుకు భారత్- పాక్ (India vs Pakistan) మధ్య చెడిన సంబంధాలు కారణమయ్యాయి.

రెండు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు 2008 నుంచి జరగడం లేదు. చివరిసారిగా ఇరు జట్ల మధ్య 2007లో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే అశ్విన్ 2011లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. టీ20లు, వన్డేల్లో పాకిస్థాన్ తో తటస్థ వేదికల్లో భారత్ తలపడింది. రెండేళ్ల కిందట టీ20 ప్రపంచ కప్ లో పాక్ పై విన్నింగ్ షాట్ అశ్విన్ కొట్టిన సంగతి తెలిసిందే. అశ్విన్ తన కెరీర్ లో టెస్టుల్లో 106టెస్టులు ఆడి 537వికెట్లు తీశాడు. అందులో 37 సార్లు ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ మొత్తం 3,503 పరుగులు చేశాడు.

టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఏడో బౌలర్‌గా అశ్విన్‌ గుర్తింపు దక్కించుకున్నాడు. అదేవిధంగా భారత్‌ బౌలర్‌లలో అనిల్‌ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర యువజన క్రీడల మంత్రి మన్‌సుక్‌ మాండవీయను కోరారు. అశ్విన్ ఖేల్‌ రత్న అవార్డుకు అర్హుడు’ అని ఎంపీ విజయ్‌ వసంత్‌ కూడా పేర్కొన్నారు.

Advertisement

Next Story