- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kuwait : ప్రధాని మోడీకి కువైట్ అత్యున్నత పౌర పురస్కారం
దిశ, నేషనల్ బ్యూరో : కువైట్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'(Order of Mubarak Al Kabeer)ను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కువైట్ రాజు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా.. భారత ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం కువైట్‌లోని బయాన్ ప్యాలస్‌లో అధికారిక లాంఛనాలతో జరిగింది.
కువైట్‌తో స్నేహ సంబంధాలను కలిగి ఉండే ప్రభుత్వాధినేతలు, రాజులు, రాజ కుటుంబాల సభ్యులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంటారు. గతంలో దీన్ని అందుకున్న ప్రముఖుల జాబితాలో.. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ తదితరులు ఉన్నారు. మొత్తం మీద ఈ పురస్కారాన్ని పొందడంతో ఇప్పటివరకు ప్రధాని మోడీ అందుకున్న అంతర్జాతీయ స్థాయి అవార్డుల సంఖ్య 20కి చేరింది.