SahaKutumba Naam: ‘సకుటుంబానాం’ ఫస్ట్ సింగిల్ అధిధాసారుని సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2024-12-22 10:40:14.0  )
SahaKutumba Naam: ‘సకుటుంబానాం’ ఫస్ట్ సింగిల్ అధిధాసారుని సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్‌(Megha Akash), రామ్ కిరణ్(Ram Kiran) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సకుటుంబానాం'(Sahakutumbhanaam). డైరెక్టర్ ఉదయ్ శర్మ దర్శకత్వంలో హెచ్‌.మహాదేవ్‌ గౌడ, హెచ్‌.నాగరత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. అయితే తాజాగా, ఇందులోంచి ఫస్ట్ సింగిల్(first single) రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అధిధాసారుని సాంగ్ డిసెంబర్ 24న సాయంత్రం 4.50 నిమిషాలకు.. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అయిన దిల్‌రాజు చేతుల మీదుగా లాంచ్ కాబోతున్నట్లు దిల్ రాజ్ ఫొటోతో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా లిరికల్ వీడియో ప్రోమో సాయంత్రం 4.14 నిమిషాలకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed