BJP MP LAXMAN : సినీ పరిశ్రమపై రేవంత్ కక్ష గట్టారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

by M.Rajitha |
BJP MP LAXMAN : సినీ పరిశ్రమపై రేవంత్ కక్ష గట్టారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్లో(Sandhya Theater) జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ(Assembly Sessions) వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విపక్ష పార్టీలు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్(K Laxman) రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమపై సీఎం కక్ష గట్టరాని, అల్లు అర్జున్ ను టార్గెట్ చేసుకొని కేసుల్లో ఇరికించడం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ పనులు ఇవి కావని, అనవసర విషయాలు వదిలేసి, రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. చట్టం చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్లుగా వినియోగించాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed