Chamala Kiran Kumar : మూసీ ఒడ్డున “దొంగ” నిద్ర కాదు.. కిషన్ రెడ్డిపై ఎంపీ చామల తీవ్ర విమర్శలు

by Ramesh N |
Chamala Kiran Kumar : మూసీ ఒడ్డున “దొంగ” నిద్ర కాదు.. కిషన్ రెడ్డిపై ఎంపీ చామల తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ (MUSI) బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సవాలను కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) స్వీకరించారు. ఈ మేరకు ఆయన రాత్రి అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని తులసీరామ్ నగర్‌లోని ఓ ఇంట్లో భోజనం చేసి అక్కడే నిద్రించారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆదివారం ఎక్స్ (X) వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ‘సికింద్రాబాద్ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు “బాధ్యతగల?” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ ఒడ్డున “దొంగ” నిద్ర కాదు.. చేతనైతే అభివృద్ధిలో మీ ముద్ర వేయండి’ అంటూ ట్వీట్ చేశారు.

‘మూసీ ఒడ్డున బాధ్యతగల కేంద్ర మంత్రి ఇలా కొత్త పరుపు, కొత్త బెడ్ షీట్, కాళ్ళకు సాక్సులు, వీటికి తోడు కెమెరామెన్ తో 20 నిమిషాల నిద్రతో వారి సమస్యలను ముందే ఊహించినట్లున్నారు. సో.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు నాణ్యమైన సాక్సులు, దోమలు ఎప్పుడూ ఎక్కడ కొడుతున్నాయో తెలుసుకోవడానికి ఇంటికి ఒక కెమెరామెన్ ని, అలాగే నైట్ 20 నిమిషాల కంటే ఎక్కువ నిద్ర పోవడానికి తగిన సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం తరపున కల్పించాలని, మూసీ పరివాహక ప్రాంత ప్రజల విజ్ఞప్తి. తదుపరి మూసీ నిద్ర ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కనీసం ఒక్క గంట అయినా నిద్రించాలని ప్రజల విజ్ఞప్తి’ అంటూ కిషన్ రెడ్డి ఫోటోతో మరో ట్వీట్ చేశారు.

Advertisement

Next Story