- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Elephant : మావటి చేత కాళ్లు పట్టించుకున్న గజరాజు
దిశ, వెబ్ డెస్క్ : ఏనుగుల(Elephants)కు కోపం వస్తే ఎంత తీవ్రంగా ఉంటాయో అవి అభిమానించే వారి పట్ల ప్రేమను కూడా అదే స్థాయిలో వ్యక్తం చేస్తుంటాయి. నిత్యం తన ఆలనా పాలన చూసే మావటి(Mavati)తో కొన్ని ఏనుగులు చాల సాన్నిహిత్యం ప్రదర్శిస్తుంటాయి. ఆలయంలో ఉత్సవాలకు మావటితో హాజరైన ఓ గజరాజం(Elephant) అతడితో తన కాళ్లు(legs)పట్టించుకున్న వీడియో వారి మధ్య సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలిచింది. ఉత్సవాలలో భాగంగా చాల సేపు నిలబడిందో ఏమో లేక కాళ్లు లాగినట్టున్నాయో మరి..తన మావటి చేత ఆ గజరాజం కాళ్లు పట్టించుకుంది.
ఏదో యాదృచ్చికంగా కాదు మరి..ఒక కాలు నొక్కగానే మరో కాలు పెడుతూ మావటితో కాళ్లు పట్టించుకుని మరి సేవలు చేయించుకుంది. ఆ మావటి కూడా తన పెంపుడు గజరాజం కాళ్లను తన ఒడిలో పెట్టుకుని మరి ప్రేమగా నొక్కి దానికి ఉపశమనం కల్గిస్తూ తన ఆప్యాయతను చాటుకున్నాడు. ఇప్పడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.