తేమ పేరుతో యిబ్బందులు.. పట్టించుకోని అధికారులు..

by Sumithra |
తేమ పేరుతో యిబ్బందులు.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ పేరుతో రైతులను యిబ్బందుల పాలు చేస్తున్నారని, వివిధ కారణాలు చూపుతూ రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారు 311 ధాన్యం కేంద్రాలు, ఏర్పాటు చేసినట్టు సమాచారం. ధాన్యం కొనుగోలు సెంటర్లలో, 42,500 కిలోల చొప్పున, మరికొన్ని సెంటర్లలో 41.500 తూకం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఫలితంగా బస్తాకు 1 కేజీ నుంచి 2 కేజీలు అదనంగా తూకం వేసి రైతుల్ని మోసం చేస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా బస్తాతో కలుపుకొని 40 కేజీల 700 గ్రాముల నికర తూకం వెయ్యాలని అధికారులు తెలిపినట్లు సమాచారం. కాని అధికారుల మాటలను ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా రైతులను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతాంగాన్ని నిట్టనిలువునా దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులకు ఇవన్నీ పట్టకపోవడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు.

డబ్బులు యిస్తే తేమ శాతం అవసరం లేదు ?

కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి నిర్వాహకులు డబ్బులు తీసుకుని తేమ శాతం చూడకుండానే ధాన్యం బస్తాలను నింపుతున్నారని, డబ్బులు ఇవ్వలేని పేద రైతులు వారాల తరబడి ధాన్యం ఆరబోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. అదేవిధంగా క్వింటా ధాన్యాన్ని బస్తాలలో నింపి లోడు వేస్తే 50 రూపాయల నుంచి 52 రూపాయలు తీసుకుంటున్నారని, లారీ డ్రైవర్ కు బస్తాకు 1 రూపాయి నుంచి 2 రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇలా రైతులను యిబ్బందులకు గురి చేస్తున్న నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చెయ్యాలని రైతులు కోరుకుంటున్నారు.

ఐకేపీ సెంటర్లలో రైతులకు తేమ పేరుతో జాప్యం చేయడం సరికాదు.. ( బాషీపంగు సునీల్)

రైతు ధాన్యం కొనుగోలు సెంటర్లు నిర్వహించే నిర్వాహకులు తేమ పేరుతో రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా కాటా వేసే సందర్భంలో ఎక్కువ మొత్తంలో 40. 700 గ్రాములు ఉండవలసినది బస్తా పేరుతో రెండు కిలోలు ఎక్కువగా ధాన్యం కాంటాలు వేస్తున్నారు. కాబట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే కాటాలు వేయాలి.

Advertisement

Next Story

Most Viewed