YCP: వైసీపీకి బిగ్ షాక్.. మూకుమ్మడిగా టీడీపీలో చేరిన సర్పంచ్‌లు

by Shiva |   ( Updated:2024-11-17 15:10:54.0  )
YCP: వైసీపీకి బిగ్ షాక్.. మూకుమ్మడిగా టీడీపీలో చేరిన సర్పంచ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ (YCP) పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా ఆ పార్టీని వీడి మరో పార్టీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వారి వెంటే తమ పయనం అంటూ కండువాలు మార్చేశారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పాలకొల్లు (Palakollu) మండల పరిధిలోని 8 గ్రామాల సర్పంచ్‌లు వైసీపీ (YCP)కి మూకుమ్మడిగా రాజీనామా చేసి మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanayudu) సమక్షంలో టీడీపీ (TDP) కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ (Jagan) పాలనలో తమకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిని కాంక్షించి అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపడితే.. ప్రభుత్వం నిధలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. కొందరు సర్పంచ్‌లు అప్పులు బాధతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈ క్రమంలో గ్రామల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము టీడీపీ పార్టీలో చేరుతున్నామని సర్పంచ్‌లు వెల్లడించారు.


Read More...

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్


Next Story

Most Viewed