CM Chandrababu: నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-17 15:02:43.0  )
CM Chandrababu: నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్ : అనారోగ్యంతో కన్నుమూసిన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి(Nara Rammurthy Naidu )అంత్యక్రియల కోసం సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కుటుంబం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంది. సీఎం చంద్రబాబు వెంట మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నారావారి పల్లెకు వెళ్లారు. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ప్రార్థివదేహానికి నివాసంలో చంద్రబాబు కుటుంబం నివాళర్పించింది.

రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ సినీ హోరో కావడంతో రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నారావారిపల్లె చేరుకుంటున్నారు. మధ్యాహ్నం జరుగనున్న రామ్మూర్తి అంత్యక్రియలకు హీరో మంచు మనోజ్ ఇప్పటికే నారావారిపల్లె చేరుకున్నారు.

Read More...

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..! రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు

Advertisement

Next Story