- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MP Etala Rajender: బీజేపీవి డ్రామాలైతే రాజకీయాలు మానేస్తా.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మూసీ ప్రాజెక్ట్ (Musi Project) విషయంలో బీజేపీ పార్టీవి డ్రామాలే అయితే తాను రాజకీయాలను మానేస్తానని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్తీ నిద్రలో భాగంగా శనివారం రాత్రి ఆయన ఎల్‌బీ నగర్ (LB Nagar)లోని మూసీ పరివాహక ప్రాంతం (Musi catchment Area)లోని ఓ ఇంట్లో నిద్రించారు. అనంతరం ఇవాళ ఉదయం ఆయన బస్తీవాసులతో మాట్లాడారు. మూసీ ప్రాజెక్ట్ (Musi Project) విషయంలో ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. బీజేపీ(BJP)వి డ్రామాలు అని కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)కు ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీ (BJP)వి డ్రామాలే అయితే మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిద్దామని.. అక్కడి ప్రజలు తమవి డ్రామలని అంటే రాజకీయాలు మానేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రభుత్వానివే డ్రామాలని వాళ్లు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ (Muse Renaissance Project) విషయంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీల ధోరణి ఒక్కటేనని ఆరోపించారు. రూ.లక్షలు పోసి కట్టుకున్న నిరుపేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతలకు ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకుని తీరుతామని అన్నారు. మూసీ పరీవాహక ప్రజలంతా ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు తాము డ్రామాలు ఆడుతున్నామని అనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.