Nara Rohit: Bye Nana.. తండ్రి మరణంపై నారా రోహిత్ భావోద్వేగం

by Rani Yarlagadda |
Nara Rohit: Bye Nana.. తండ్రి మరణంపై నారా రోహిత్ భావోద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సోదరుడు, మాజీ ఎమ్మెల్యే, నటుడు నారా రోహిత్ (Nara Rohit) తండ్రి.. నారా రామ్మూర్తి (Nara Rammurthy) శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తండ్రి మరణంపై నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. "నాన్నా.. మీరొక ఫైటర్. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు. ఈ రోజు నేనీ స్థాయిలో నిలబడటానికి కారణం మీరే. ఎన్ని కష్టాలున్నా..అవి మా వరకూ రాకుండా పెంచారు. మీతో జీవితాంతం ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు. బై నాన్నా." అంటూ నారా రోహిత్ భావోద్వేగానికి గురయ్యారు.

ఆయన పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ధైర్యంగా ఉండండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం రామ్మూర్తి భౌతిక కాయాన్ని బేగంపేట ఎయిర్ పోర్టు (Begumpet Airport) నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు తరలించారు. నేడు మధ్యాహ్నం నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

Next Story