- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరికాదు: అద్దంకి దయాకర్
దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కొందరు ప్రభుత్వాన్ని తప్పుబడితే మరికొందరు హీరో అల్లు అర్జున్ ను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట వ్యవహారం అసెంబ్లీ వరకు చేరింది. అయితే అసెంబ్లీలో ఈ ఘటనపై చర్చించాల్సి అవసరం లేదని, ముగిసిపోయిన సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెచ్చగొట్టిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీలపై పగబట్టినట్లు వ్యవహరిస్తుందని విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు. ఈ ఘటనలో ఒక ప్రాణం పోయింది కాబట్టి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉందని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు వ్యాఖ్యలతో ఈ విషయాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా అల్లు అర్జున్ ముందుకు రావాలంటూ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.