- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో..ఇదేం.. బీటీ రోడ్డు.. ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం
దిశ,పెద్దకొత్తపల్లి : కొల్లాపూర్ మండలం నా ర్లాపూర్ నుంచి పెద్ద కొత్తపల్లి మండలం వేడుకరావుపల్లి తండా, మారేడుమాన్ దిన్నే గ్రామాలకు ఈ బీటీ రోడ్డు పై ప్రయాణించాలంటే అరచేతిలో ప్రాణాలను అర పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి దాపురించింది.దశాబ్ద కాలం క్రితం చేపట్టిన బీటీ రోడ్డు ఎక్కడికక్కడ ధ్వంసమైంది. బీటీ పూర్తిగా దెబ్బతిన్నది.ఈ రోడ్డు మార్గంలో ప్రధానంగా ద్విచక్రవాహనాల పై ప్రయాణించాలంటే గమ్యస్థానాలకు చేరుకుంటామన్న నమ్మకం లేదు. రోడ్డుపై మార్గమధ్యంలో వాహనాల పై నుంచి ఎక్కడ కింద పడిపోతానేమోనని భయాన్ని వాహనచోదకులను వెంటాడుతుంది.ఈ రోడ్డు పై ప్రయాణించాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. గత్యంతరం లేని పరిస్థితులలో నరకయా తనపడుతూ ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. బీటీ రోడ్డు పొడవునా వర్షాలకు కోతకు గురై గుంతలు ఏర్పడ్డాయి.
ఈ రహదారిలో నడివాగుతాండ(వేడుకరావు పల్లి) దగ్గర ప్రమాదం పొంచి ఉన్నది. ఈ రోడ్డు వెంబడి సైతం అడుగడుగునా రోడ్డు పై గుంతలు పడి కనీసం ఎదురుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇవ్వాలంటే కూడా గుంతలోకి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.ఈ నియోజకవర్గ శాసన సభ్యుడు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి రోడ్డు మరమ్మతులు చేయించలేకపోవడం చేత తమకు శాపంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రతి ఆదివారం జరిగే నాయినేని పల్లి మైసమ్మ దేవత దర్శనానికి ఈ రోడ్డు పై ద్విచక్ర వాహనాలు తో పాటు ట్రాక్టర్లు జీపులు తదితర వాహనాలలో కొల్లాపూర్,పెంట్లవెళ్లి,చిన్నాంబావి,వీపనగండ్ల మండలాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రహదారి లో గుంతలో ఎడ్లబండ్లు సైతం బోల్తాపడి ప్రమాదాలకు గురైన సంఘటనలు లేకపోలేదు. ప్రమాదాలు జరగకముందే మంత్రి, అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించ వలసిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.
దెబ్బతిన్న బీటీ రోడ్డును పట్టించుకోండి : జగదీష్ నాయక్, వేడు కరావుపల్లి తండా
కొల్లాపూర్ పెద్ద కొత్తపల్లి మండలాల సరిహద్దుల్లో నల్లమల అటవీ ప్రాంతం గుండా గత పదేళ్ళ క్రితం నిర్మించిన బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రోడ్డు మార్గంలో నరకయాతన తో రాకపోకలు సాగిస్తున్నారు.ఇప్పటికైనా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరుతున్నాం.