గోల్డ్ రాబరీ కేసులో అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు

by Sridhar Babu |
గోల్డ్ రాబరీ కేసులో అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఈనెల 12 తేదీన మిట్టపల్లి జలజ అనే ప్రయాణికురాలి వద్ద నుండి 37 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జగిత్యాల పోలీసులు వారం వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ కేసు వివరాలను వెల్లడించారు.

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన ఐదుగురు మహిళల దొంగల ముఠాగా గుర్తించారు. ఈ క్రమంలో దొంగిలించిన బంగారాన్ని సోమవారం ఉదయం అమ్మడానికి వచ్చిన హత్గాడే కాంత అనే మహిళను చాకచక్యంగా అరెస్ట్‌ చేసి 31 తులాల గోల్డ్ రికవరీ చేశారు. మరో నలుగురు మహిళా దొంగలు పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్సైలు కిరణ్, మన్మథరావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story