- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా ఆడండి..పేరు ప్రతిష్టలు తీసుకురండి : ఎమ్మెల్యే సామేలు
దిశ,తుంగతుర్తి: పిల్లలు... శభాష్...! మీరంతా బాగా ఆడి రాష్ట్రస్థాయిలో ఎంపికైనందుకు ఎంతో సంతోషపడుతున్న...!! ఇలాగే పై స్థాయిలో ఆడుతూ మంచి పేరు,ప్రతిష్టలు తీసుకురండి ...అంటూ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పిలుపునిచ్చారు.తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాల నుంచి సీఎం కప్ క్రీడలైన కబడ్డీ కోకో వాలీబాల్ అథ్లెటిక్స్ లలో రాష్ట్ర స్థాయి కి ఎంపికైన విద్యార్థులను ఆయన సోమవారం అభినందిస్తూ ప్రోత్సాహకరంగా నగదు పురస్కారాలతో పాటు షూస్ లను అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ ఉమా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను చూసి తాను గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.
కష్టపడి చదువుతూ పై స్థాయిలో ఆడుతూ పాడుతూ రాణిస్తూ అందరికీ కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు.ఇలాంటి వారికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుందని వివరించారు.సమావేశంలో డీఎండబ్ల్యుఓ జగదీశ్వర్ రెడ్డి,ఎంఈఓ లింగయ్య, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ వెంకన్న,డీసీసీబీ డైరెక్టర్ సైదులు,పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్,తదితరులు పాల్గొన్నారు.