- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CS: స్వయం సహాయక సంఘాల మహిళలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లోని స్వయం సహాయక సంఘాలకు(self-help groups) కాంగ్రెస్ సర్కార్(Congress government) శుభవార్త చెప్పింది. ఈ సంఘాల ద్వారా 231 ఎకరాల సోలార్ పవర్ ప్లాంట్లు(solar power plants), 150 ఎలక్ట్రిక్ బస్సులను(electric buses) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Chief Secretary Shanti Kumari) అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళాశక్తి (మహిళా సాధికారత) (Mahila Shakti) కార్యక్రమంపై సీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్(Panchayat Raj and Rural Development Secretary Lokesh Kumar), పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన(Rural Development Commissioner Srujana), సెర్ప్ సిఈవో దివ్య(SERP CEO Divya) సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. మహిళా అభివృద్ది కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా.. ఐదు జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు వచ్చే ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న ఎండోమెంట్ భూములను స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కౌలుకు ఇవ్వాలని సూచించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మహిళా సంఘాల సభ్యులను శక్తివంతం చేయడం, వారిని లక్షాధికారులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ సంఘాల నుండి మహిళలు నిర్వహించాల్సిన 150 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణ బాధ్యతను టీజీఎస్ఆర్టీసీకి(TGRTC)కి అప్పగించాలని శాంతి కుమారి ప్రతిపాదించారు.