- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు
దిశ, కరీంనగర్ లీగల్ : వదినతో పెట్టుకున్న వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నదనే అక్కసుతో భార్యను కత్తితో పొడిచి హత్యచేసిన కేసులో నిందితుడు షేక్ రఫీక్ (35) కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు కరీంనగర్ పట్టణంలోని హుస్సేన్ పురాకు చెందిన సయ్యద్ హైదర్ కు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు రైన షాకిరా భర్త ఇటీవల క్యాన్సర్ తో చనిపోయాడు. చిన్న అల్లుడైన షేఖ్ రఫీక్ వదిన అయిన రైనా షాకిరా తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయంపై పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరిగినా అతనిలో మార్పురాలేదు. ఈ క్రమం లో 2020 ఏప్రిల్ 24 న సాయంత్రం అక్రమ సంబంధం విషయంలో భర్త షేఖ్ రఫిక్ ని అతని భార్య పర్వీన్ సుల్తానా నిలదీయగా అతను కత్తి భార్యను పొడిచి చంపాడు. దీనిపై 3వ పట్టణ పోలీసులకు షేఖ్ రఫిక్ పై ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై అన్వర్ కేసు నమోదు చేశారు. సీఐ విజ్ఞనరావు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలూరి శ్రీరాములు విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి నిందితుడు షేక్ రఫిక్ కు జీవిత ఖైదుతో పాటు వేయి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.