Sriteja Health Bulletin : శ్రీతేజ హెల్త్ బులిటెన్ విడుదల

by M.Rajitha |
Sriteja Health Bulletin : శ్రీతేజ హెల్త్ బులిటెన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theater Incident)లో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ హెల్త్ బులిటిన్(Sriteja Health Bulletin) విడుదల చేశారు కిమ్స్(KIMS) వైద్యులు. శ్రీతేజ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, నేడు వెంటిలేటర్ తొలగించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం లిక్విడ్ ఆహారాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. కాగా పుష్ప2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ తీవ్ర గాయలపాలయ్యాడు. శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడటంతో శ్రీతేజ కోమాలోకి వెళ్ళగా.. దాదాపు 20 రోజుల చికిత్స అనంతరం కొద్దికొద్దిగా కోలుకుంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed