War-2: దీంతో వార్2 ముగుస్తుంది.. సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్

by Ramesh Goud |
War-2: దీంతో వార్2 ముగుస్తుంది.. సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ‘వార్ 2’ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు హృతిక్ రోషన్.

ఇందులో భాగంగా తన X వేదికగా.. ‘ఇది చివరి షెడ్యూల్‌తో ‘వార్ 2’ ముగుస్తుంది’ అని ట్వీట్ చేశారు. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఈ చివరి షెడ్యూల్‌లో హృతిక్, ఎన్టీఆర్‌ల మధ్య భారీ పోరాట ఘట్టన్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తుండగా.. స్పిరో రజాటోస్, సే-యోంగ్ ఓహ్ అనే ఇద్దరు ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్స్ నేతృత్వంలో ఇది జరగనుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed