- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయితో పట్టుబడిన ఇద్దరు రిమాండ్
by Sridhar Babu |
X
దిశ, తంగళ్లపల్లి : గంజాయి తాగుతూ.. ఇతరులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ కె. మొగిలి తెలిపారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడూర్ గ్రామ శివారులో గల ఎల్లమ్మ గుడి వద్ద తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కుంటి అభిలాష్, టెక్స్ట్ టైల్ పార్క్ కి చెందిన కనుకుంట్ల మహేష్ లు గంజాయి తాగడంతో పాటు అమ్ముతూ పట్టుబడ్డారని వివరించారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ కె.మొగిలి తెలిపారు. ఎవరైనా గంజాయి సేవించినా, విక్రయించినా చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story