ప్రజావాణిలో వయో వృద్దుని సమస్య పరిష్కారం..

by Aamani |
ప్రజావాణిలో  వయో వృద్దుని సమస్య పరిష్కారం..
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజావాణిలో ఓ వయోవృద్ధుడికి న్యాయం జరిగింది. మహబూబ్ నగర్ పట్టణం టిడి గుట్ట లో నివాసం ఉంటున్న సాయన్న అనే 78 సంవత్సరాల వృద్ధుడు తన ఇద్దరు కుమారులు తన బాగోగులు పట్టించు కోవడం లేదని ప్రజావాణి ద్వారా 20 రోజుల క్రితం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. తన ఇద్దరు కుమారులు శేఖరయ్య,శివ రాములు తనను తన భార్య చెన్నమ్మ ను తనను సరిగా చూసుకోవటం లేదని, చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని వృద్ధుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ దరఖాస్తు పై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆర్డీఓ కు తగు చర్య తీసుకోవాలని సూచించారు. వృద్ధుని ఫిర్యాదుపై స్పందించిన మహబూబ్ నగర్ అర్.డి. ఓ.నవీన్ వృద్ధుని ఇద్దరు కుమారులకు వృద్ధుల సంరక్షణ ,పోషణ చట్టం క్రింద ఈ నెల 5 న నోటీస్ జారీ చేస్తూ ఈ నెల 28 న ఆర్డీఓ ట్రిబ్యునల్,ఆర్డీఓ కార్యాలయం కు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఇద్దరు కుమారులు తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటామని రాజీకొచ్చారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం కు వచ్చిన వయో వృద్దుడు సాయన్న జిల్లా కలెక్టర్,ఆర్డీవో కు కృతజ్ఞతలు తెలుపుతూ తాను ఇచ్చిన ఫిర్యాదు ను వాపసు తీసుకున్నారు.

Advertisement

Next Story