T Congress : అల్లు అర్జున్ అలా చేసి ఉండాల్సింది : చామల కిరణ్ కుమార్ రెడ్డి

by M.Rajitha |
T Congress : అల్లు అర్జున్ అలా చేసి ఉండాల్సింది : చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) మరోసారి నటుడు అల్లు అర్జున్(Allu Arjun) మీద ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ స్క్రిప్ట్ రాసుకొచ్చి ప్రెస్ మీట్లో చదివారని, అలా కాకుండా అసలు నిజాన్ని మీడియా ముందు మనస్పూర్తిగా బయటపెట్టి ఉంటే నిజంగా హీరో అయ్యి ఉండేవాడని అన్నారు. సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తనకు తరువాతి రోజు తెలిసింది అనడం అబద్దం కాదా అని ఎంపీ ప్రశ్నించారు. అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నిన్నటి మీడియా సమావేశంలో పోలీసులు క్లియర్ గా చెప్పారని పేర్కొన్నారు. మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకు వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని, తెలుగు సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన తోడ్పాటు మరెవరూ అందించలేదని గుర్తు చేశారు. ప్రత్యేక షోల పేరిట ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే సీఎం కఠిన చర్యలు తీసుకున్నారని, దానిలో ఎలాంటి తప్పు లేదన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story