Viral: మేడమ్ మంచి డాన్సరే.. "పీలింగ్స్​" పాటకు లేడీ ప్రొఫెసర్​ స్టెప్పులు!

by Ramesh Goud |
Viral: మేడమ్ మంచి డాన్సరే.. పీలింగ్స్​ పాటకు లేడీ ప్రొఫెసర్​ స్టెప్పులు!
X

దిశ, వెబ్ డెస్క్: "పీలింగ్స్​" పాటకు(Peelings Song) ఓ లేడీ ప్రొఫెసర్(Lady Professor​) స్టెప్పులు(Dancing) వేసిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) గా మారింది. సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప–2’(Pushpa-2) సినిమా వివాదాల మధ్య చిక్కుకున్నా.. ఆ సినిమాలోని పాటలు మాత్రం మంచి క్రేజ్ సంపాధించుకున్నాయి. ఈ మూవీలోని కిసిక్క్ సాంగ్, పీలింగ్స్ సాంగ్ కి యువత రెచ్చిపోయి స్టెప్పులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీలింగ్స్ పాటకు కొచిన్‌(Cochin)లోని ఓ యూనివర్సిటీ(University)లో జరిగిన వేడుకల్లో విద్యార్థినిలు డాన్స్ మొదలు పెట్టారు. దీంతో అక్కడే ఉండి ఇది చూస్తున్న మహిళా ప్రొఫెసర్(Female Professor) కాలు నిలుపుకోలేక విద్యార్థినిలతో జత కట్టారు. అదే స్టేజీపై విద్యార్థులతో కలసి "పీలింగ్స్" పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. మేడమ్ తమతో జత కట్టడం చూసిన విద్యార్థినులు రెచ్చిపోయి డాన్స్ ఇరగదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. డాన్స్ వేసిన ప్రొఫెసర్ ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేగాక మేడమ్ మంచి డాన్సర్ అయ్యి ఉంటుందని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed