- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదల ఇంటి కల నెరవేరుతుంది
దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన నిరుపేదలందరికీ సొంతిల్లు కల నెరవేరుతుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తుందని, నమూనాగా చేపడుతున్న ఇంటిలో హాలు బెడ్ రూమ్ కిచెన్ తో పాటు ఇంట్లోనే బాత్ రూమ్ ఉంటుందన్నారు.
ఆర్థిక స్థోమత ఉన్నవారు కొన్ని మార్పులు చేసుకుని ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం నాలుగు దఫాలుగా నగదు చెల్లిస్తామని, నియోజకవర్గ వ్యాప్తంగా 57,629 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 30 వేల మంది అర్హులు ఉన్నారన్నారు. వారందరికీ దశలవారీగా ఇళ్లు ఇస్తామన్నారు. త్వరలోనే మొదటి విడతలో 3500 మందికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, గృహ నిర్మాణ డీఈఈ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.