Best foods: మెగ్నిషియం అధికంగా ఉండే బెస్ట్ ఆహారాలు..!!

by Anjali |
Best foods: మెగ్నిషియం అధికంగా ఉండే బెస్ట్ ఆహారాలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరానికి అవసరమైన పోషకాల్లో మెగ్నిషియం ఒకటి. మెగ్నీషియం ఆరోగ్యకరమైన కండరాలు, నరాలు, ఎముకలు, రక్తంలో చక్కెర స్థాయిలకు అవసరమైన ఒక ఖనిజం. మెగ్నీషియం లభించే ఆహారాలు కనుక తీసుకోకపోతే.. గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం లేదా బోలు ఎముకల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా పలు రకాల కూరగాయలు తింటే శరీరానికి కావాల్సినంత మెగ్నిషియంను సులభంగా పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆవాలు కాకరకాయ..

సాధారణంగా ఆవాలను కూరల్లో వాడుతుంటామన్న విషయం తెలిసిందే. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే 32 మిల్లీ గ్రాముల మేర మెగ్నిషియం శరీరానికి లభిస్తుందట. ఇక కాకర ఉపయోగాలు తెలిసిందే. 100 గ్రాముల కాకరకాయ తింటే 17 మిల్లీగ్రాముల మెగ్నిషియం అందుతుంది.

మెంతులు ,బెండకాయ..

బెండకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వంద గ్రాముల బెండకాయ తింటే 57 మిల్లీ గ్రాముల మెగ్నిషియం లభిస్తుంది. అలాగే 100 గ్రాములు మెంతులకు, 51 మిల్లీ గ్రాముల మెగ్నిషియం పొందవచ్చు.

స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు..

చికెన్, మటన్ లో ఉన్నన్ని పోషకాలు, ప్రోటీన్లు పచ్చి బఠానీల్లో ఉంటాయి. వంద గ్రాముల పచ్చి బఠానీలు తీసుకుంటే 33 మిల్లీ గ్రాములు.. అలాగు 100 గ్రాముల స్వీట్ కార్న్ తింటే 27 మిల్లీగ్రాముల మెగ్నిషియం లభిస్తుంది.

మునగాకు, పాలకూర..

మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆకుల్లో పాలకూర ఒకటి. వంద గ్రాముల ఉడకబెట్టిన పాలకూర తింటే ఏకంగా 87 మిల్లీగ్రాముల మెగ్నిషియం అందుతుంది. అలాగే 100గ్రాముల ఉడకబెట్టిన మునగాకు తీసుకుంటే 45 మిల్లీ గ్రాముల మెగ్నిషియం పొందవచ్చు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed