- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప మూవీ నిర్మాత రూ.50 లక్షల ఆర్థికసాయం
దిశ, సినిమా: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను ‘పుష్పా 2’ నిర్మాత నవీన్‌తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అనంతరం పుష్పా 2 నిర్మాతతో కలిసి కోమటిరెడ్డి రూ.50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి భర్త భాస్కర్‌కు అందజేశారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని.. దేవుడు దయవల్ల అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుంది అనే దానిపై కూడా మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీ ఎక్కడికి పోదు. మద్రాసు కంటే ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్. ఇక్కడి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రపంచస్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ చేసుకుంటున్నాయి. మీరు తరలిపోతున్నాయా అని అడుగుతున్నారు. సోషల్ మీడియా ఇలాంటివే ప్రచారాలు చేస్తున్నారు. ప్రతీదాన్ని రాజకీయం చేయొద్దు. ఇంతపెద్ద ఇన్సిడెన్స్ జరగడం నాకే చాలా బాధగా ఉంది. నా కుటుంభంలో ఓ సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నా నేను. ఎందుకంటే ఆ కుటుంబం పరిస్థితి చూసి చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చెయొద్దు’ అని తెలిపారు. అలాగే ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.