భద్రకాళి వైన్స్‌లో చోరీ..

by Kalyani |
భద్రకాళి వైన్స్‌లో చోరీ..
X

దిశ, తొర్రూరు:- మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని మార్కెట్ సెంటర్‌లో ఉన్న భద్రకాళి వైన్స్‌లో భారీ చోరీ చోటు చేసుకుంది. వైన్స్ నిర్వాహకులు వెల్లడించిన సమాచారం ప్రకారం… చోరులు దుకాణంలోకి ప్రవేశించి రూ. 20,000 నగదు, సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యం సీసాలను అపహరించారు.ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై ఉపేందర్ తెలిపిన ప్రకారం… సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి ఫింగర్ ప్రింట్లు, ఇతర ఆధారాలను సేకరించారు. చోరీ సంఘటన రాత్రి ఒకటి గంటల సమయంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణను ముమ్మరం చేసి, నిందితులను పట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది.

Advertisement

Next Story

Most Viewed